క్రిప్టోకరెన్సీ 2021

క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ అఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021

ప్రస్తుత  పార్లమెంటరీ సమావేశాలలో క్రిప్టోకరెన్సీ సంబందించిన బిల్లు ప్రవేశపెట్టబోతున్నారని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు తెలిపారు.’

`క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ అఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్, 2021′  ఎలావుండబోతున్నది అనే విషయం మీద ఇప్పటికే విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాబినెట్ ఆమోదం పొందిన తరువాత ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతారు.

క్రితం బిల్లులో లేని అంశాలను , వర్చు వల్ కరెన్సీలో వేగంగా వస్తున్న అనేక మార్పులను ఈ బిల్లు పరిగణం లోనికి తీసుకుంటుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. RBI అఫీషియల్ డిజిటల్ కరెన్సీ కి సంబంధించిన ప్రతిపాదన కూడా ఈ బిల్లులో ఉండబోతోందని  సమాచారం.

సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (CBDC) లో బ్లాక్ చైన్ టెక్నాలజీని  ఉపయోగిస్తున్నారని, క్రిప్టోకరెన్సీలో కూడా ఈ టెక్నాలాజీనే  ఉపయోగించేవారని  తెలిస్తోంది .  CBDC వలన నగదుపై ఆధారపడటం తగ్గడం మాత్రమేకాక   విశ్వసనీయ, సమర్ధవంతమైన , చట్టపరమైన చెల్లింపులకు  అవకాశముంటుంది.