చాణుక్యనీతి – ధనవంతుడు కావాలని కోరుకునేవారు పాటించవలసిన సూత్రాలు

చాణుక్యుడు ఆర్థికశాస్త్రంలో గొప్ప పండితుడుగా  ప్రసిద్ధి పొందారు. చాణుక్యనీతి సూత్రాలు నేటి సమాజానికి ఆచరణీయం.

  1. ధనవంతులు కావడానికి కష్టపడి పనిచేయడం అనేది చాలా ముఖ్యం అని ఆచార్య చాణుక్యుడు చెప్పారు. తన లక్ష్యం కొరకు కష్టపడి పనిచేసే వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు .
  2. ధనవంతులు కావాలని భావించే వాళ్లు వృథాగా ధనాన్ని ఖర్చు చేయకూడదు. ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం వల్ల నష్టం వస్తుంది అని గుర్తుఉంచుకోవాలి. ధనాన్ని సరియైన ప్రణాళికతో ఖర్చు పెట్టనట్లైతే, అది పేదరికానికి కారణం అవుతుంది.
  3. వ్యక్తి ధనం సంపాదించిన తర్వాత ఆ ధనాన్ని ఎలా ఆదా చెయ్యాలి అనే విషయం మీద సరియైన అవగాహన ఉండాలి. ధనాన్ని ఒకేచోట పొదుపు చేసినిట్లయితే కూడా నష్టపోయే ప్రమాదం వుంది.
  4. ధనం విషయంలో దురాశ పనికిరాదు. దురాశ వున్నవారు ఎంతకైనా దిగజారుతారు. ధనం ఉందని అహం కలిగిన వ్యక్తులు జీవితంలో ముందుకు’వెళ్ళలేరు. తన వారందరికీ దూరం అవుతారు. ధనం సంపాదించడానికి తప్పుడు మార్గం ఎన్నుకున్నవాడు జీవితంలో ఎదగలేరు.
  5. ఏ వ్యక్తి అయినా తనకు రావలసిన ధనాన్ని తీసుకునేందుకు సిగ్గుపడకూడదు. అలా ధనాన్నితీసుకోవడానికి సిగ్గు పడితే ఆ వ్యక్తి నష్టపోతాడు. తన స్వంత ధనాన్ని కూడా నష్టపోతాడు. ఆ వ్యక్తి క్రమంగా పేదరికంలోకి జారే పరిస్థితి వస్తుంది. ప్రతి వ్యక్తి తన రాబడి ఖర్చుల విషయంలో’ఖచ్చితమైన విధానాన్ని అవలంభించాలి.
  6. ఒక వ్యక్తి తన జీవితంలో విజయం, సంపద సాధించాలంటే అతను  క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని  అనుసరించాలి. ప్రతిపనిని క్రమశిక్షణతో సమయానికి పూర్తిచేసే వ్యక్తిని మాత్రమే విజయం వరిస్తుంది. తద్వారా ధనంకూడా సంపాదించగలుగుతాడు.
  7. ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. సవాళ్ళను ధైర్యంగా  ఎదుర్కునే వ్యక్తికి  ప్రతి పనిలో విజయం లభిస్తుంది.

ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా ఎక్కువ మొత్తంలో ధనాన్ని సంపాదించడం సాధ్యమవుతుందని చాణక్యుడు తన సూత్రాలద్వారా తెలియజేసారు.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసం, మరియు అందుబాటులో వున్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.)