RBI New Clearing Rules

ఆగష్టు 1 తేదీ నుండి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ నిబంధనలు మారబోతున్నాయి. ఈ సేవలు ఇక 24 X 7 అందుబాటులో ఉంటాయి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ కొత్త నిబంధనలు  ప్రకారం సాలరీస్ , పెన్షన్ , సబ్సిడీ వంటి  బల్క్ ఇకనుండి వారంలోని 7రోజూలూ ట్రాన్సఫర్ చేయవచ్చు .

అదే విధంగా  లోన్ ఈ ఎం ఐ చెల్లించేవారూ  జాగ్రత్త గా ఉండాలి . సాధారణంగా ఆదివారం లేదా ఇతర బ్యాంకు సెలవు దినాలలో లోన్ ఈ ఎం ఐ కట్ కాదు. మీ అకౌంట్ లో డబ్బు అలానే ఉంటుంది . తరువాతి వర్కింగ్ డే రోజున   లోన్ఈ ఎం ఐ కట్ అవుతుంది .  ప్రస్తుతం ఇలానే జరుగుతోంది .

అయితే ఆగష్టు 1 వ తేదీ నుండి క్రొత్త రూల్ ప్రకారం బ్యాంకు హాలిడేస్ తో సంబంధం లేకుండా లోన్ ఈ ఎం ఐ – ఈ ఎం ఐ డేట్ రోజునే కట్ అవుతుంది . కాబట్టి ఈ ఎం ఐ డేట్ కి ఖచ్చితంగా అకౌంట్ లో ఈ ఎం ఐ కి సరిపడినంత బాలన్స్ మెయింటైన్ చెయ్యాలి . లేదంటే పెనాల్టిస్ పే చెయ్యాల్సి వస్తుంది .