Inspire Your Kids – Telugu New Year Story with Kalam Quotes

చంద్రుడిని తాకిన సాహితీ

నూతన సంవత్సర ప్రేరణ కథ

చిన్న గ్రామంలో సాహితీ అనే అమ్మాయి ఉండేది. ఆమె ప్రతి రాత్రి ఆకాశంలోని చంద్రుడిని చూసి, “నేనూ ఒకరోజు పైకి ఎగురుతాను, ఆకాశాన్ని తాకుతాను, చంద్రుడి మీదికి వెళతాను” అని కలలు కనేది.

కానీ ఆమె స్కూల్లో చాలా వెనుకబడి ఉండేది. గణితం, సైన్స్ చాలా కష్టంగా ఉండేవి. ఆమె స్నేహితులు ఆమెను చూసి నవ్వేవారు. “సాహితీ, నువ్వు చంద్రుడి మీదికి ఎలా వెళ్తావు?? నీకు చదువే రాదు!” అని.

నూతన సంవత్సర రోజున, టీచర్ ఒక పుస్తకం చూపించారు. దానిలో APJ అబ్దుల్ కలాం గారి కథ ఉంది.

టీచర్ చెప్పారు: “కలాం గారు రామేశ్వరం లోని ఒక చిన్న బాలుడు. అతను వార్తాపత్రికలు అమ్మేవాడు. కానీ అతను ఎప్పుడూ కలలు కన్నాడు. అతను చెప్పారు –

‘కలలు నిజం కావాలంటే, చేతులు ముడిచి కూర్చోకండి, కష్టపడి పనిచేయండి.'”

సాహితీ నిర్ణయించుకుంది – “నేను మారతాను!”

ఆమె ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచేది. సైన్స్ చదివేది. గణితం ప్రాక్టీస్ చేసేది. స్నేహితులు ఆడుకునేప్పుడు, సాహితీ లైబ్రరీలో కూర్చునేది.

ఆరు నెలల తర్వాత, సాహితీ క్లాసులో ఫస్ట్ వచ్చింది! అందరూ ఆశ్చర్యపోయారు.

టీచర్ మళ్ళీ కలాం గారి మాటలు చెప్పారు: “విజయానికి ఒక రహస్యం ఉంది – మీ లక్ష్యం పట్ల అతి తీవ్రమైన ఆసక్తి ఉండాలి. అప్పుడు విజయం తప్పదు.”

ఇప్పుడు సాహితీ సైంటిస్ట్ కావాలని కలలు కంటోంది. ఆమెకు తెలుసు – కలలు, కష్టం, ధైర్యం ఉంటే, చంద్రుడికి కూడా చేరువ!

💫 పిల్లలూ! మీరు కూడా చేయగలరు! ఈ కొత్త సంవత్సరంలో మీ కలలు సాకారం చేసుకోండి. కష్టపడితే చంద్రుడికి మీదికి వెళ్ళడం కూడా కష్టం కాదు.! 💫

నేర్చుకోవలసినవి:

  • కలలు తప్పక కనాలి.
  • కష్టపడితే అసాధ్యం లేదు.
  • ఇతరులు ఏం అన్నా పట్టించుకోకూడదు.