డిజిటల్ (కరెన్సీ)దిశగా భారత్ ఆర్ధికరంగం అడుగులు
రిజర్వుబ్యాంకు భారతదేశంలో సొంత డిజిటల్ కరెన్సీ త్వరలో తీసుకురానుంది. ఆర్ధికరంగంలో సరికొత్త మార్పులను తీసుకుని వచ్చే క్రమంలో, డిజిటల్ కరెన్సీని ప్రారంభిస్తున్నామని రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తి కాంతా దాస్ ప్రకటించారు. డిజిటల్ రూపీ ట్రయల్స్ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం వున్న కరెన్సీనోట్స్, నాణాలకు ఆన్ లైన్ రూపంగా డిజిటల్ రూపీ ఉంటుందని స్పష్టంచేశారు. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీలు (CBDC)గా పేర్కొనే ఈ డిజిటల్ కరెన్సీ ఆన్ లైన్ లో చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు.
డిజిటల్ కరెన్సీ అనేది మనదేశం లో పూర్తిగా కొత్త అంశం కాబట్టి రిజర్వు బ్యాంకు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అని రిజర్వుబ్యాంకు గవర్నర్ స్పష్టం చేశారు .