COVID-19 మనకు ఎన్నో పాఠాలు నేర్పింది!
ముఖ్యంగా డబ్బుకి సంబంధించి చాలా పాఠాలను మనకు నేర్పింది.
కరోనా ముందు ఖర్చులు అదుపు , సేవింగ్స్ , ఇన్సూరెన్సు లాంటి విషయాలను వాయిదా వేసేవారు.
కరోనా సమయంలో చాలామంది ఉపాధి కోల్పోయారు. కొంతమంది సగం జీతానికే పనిచేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ సమయంలో ఎప్పుడినుండో దాచుకున్న చిన్నచిన్న savings కూడా చాలా ఉపయోగపడ్డాయి. ఇక gold గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కరోనా – మనిషి ఆలోచనా విధానాన్ని మార్చి వేసింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో , ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సివస్తుందో అనే భయం ప్రతివారిని వెంటాడుతోంది. భవిష్యత్ గురించి భయం , జాగ్రత్త తీసుకోవాలి అనే ఆలోచన మొదలైంది.
ఆదాయ నిర్వహణ , పొదుపు, సరియైన పెట్టుబడి అనేవి కొంచం కష్టతరమైన అంశం. మనీ మేనేజిమెంట్ తెలిసినవారికి మాత్రమే అది సాధ్యం అవుతుంది.
- ప్రజలు ఇప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. శాలరీలో వీలైనంత ఎక్కువ భాగాన్ని పొదుపు చేస్తున్నారు.
- బయటి నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం తగ్గించి, ఇంటి ఫుడ్ తింటున్నారు. ఆరోగ్యరీత్యా కూడా ఇది మంచి పద్దతి , అలాగే డబ్బు ఖర్చు కూడా తగ్గుతుంది.
- అనవసరపు ట్రావెల్ ఖర్చులు కూడా బాగా తగ్గించారు.
- సినిమాలు, వీకెండ్ ఔటింగ్ లాంటి ఎంటర్టైన్మెంట్ ఖర్చులు కూడా తగ్గించారు.
- హోమ్ డెకొరేషన్స్ , ఫర్నిచర్ లాంటి వాటి బడ్జెట్ సాధ్యమైనంత తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
- ఎలక్ట్రిసిటీ, మెడిసిన్స్ , గ్రోసరీ లాంటి వాటిమీద మాత్రమే ఖర్చులు పెడుతున్నారు. వాయిదా వేయదగిన ఖర్చులు వాయిదావేస్తున్నారు.
- ఫిక్సడ్ డిపాజిట్ మాత్రమేకాక , సేవింగ్స్ అకౌంట్ లో కొంత అమౌంట్ రెడీగా ఉంచుకొంటున్నారు. అది మాత్రమేకాక కొంత క్యాష్ కూడా అందుబాటులో పెట్టుకుంటున్నారు.
- హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత పెరిగింది. పాత పాలసీలు డ్యూ డేట్ కి రెన్యువల్ చేయడం , పాలసీ sum assured amount పెంచడం, అవసరాన్ని బట్టి కొత్త ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవడం చేస్తున్నారు.
- గోల్డ్ , సిల్వర్ లాంటి వాటి మీద ఇన్వెస్టుచేస్తున్నారు.
- Mutual funds , Debentures , Shares లో పెట్టుబడి పెడుతున్నారు.
- PPF account , Fixed deposits లో సేవింగ్స్ చేస్తున్నారు.
కరోనా మనీ మేనేజిమెంట్ లేనివారికి గుణపాఠాలు నేర్పింది. మన పెద్దవారు `డబ్బు ఆదా ఎంత ముఖ్యం’ అనే విషయం పదేపదే చెప్పేవారు. కరోనా మరోసారి ఆ విషయం నిరూపించింది.